: మమ్మల్ని సపోర్ట్ చేయండంటూ కేటీఆర్ ఫోన్... ఆలోచిస్తామంటూ జగన్ సమాధానం
తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తమకు మద్దతు పలకాలంటూ ఆయన జగన్ ను కోరారు. అందుకు బదులుగా జగన్ స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, అధికార టీఆర్ఎస్ శాసనమండలి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే ఆ పార్టీ వామపక్షాలు, ఎంఐఎం మద్దతు కోరినట్టు సమాచారం. అయితే, ఆయా పార్టీలు తమ వైఖరిని వెల్లడించాల్సి ఉంది. కాగా, మండలిలో తమ వారినే గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని గత కొన్ని రోజులుగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.