: ఆ ముహూర్తాన్ని వివాదాస్పదం చేయొద్దు... సంకల్పానికి మించిన ముహూర్తం లేదు: చంద్రబాబు
ఏపీ రాజధాని భూమిపూజకు నిర్ణయించిన ముహూర్తం సరిగా లేదని, అలాంటి ముహూర్తంలో పనులు ప్రారంభిస్తే కీడు జరుగుతుందని వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. అసలు, రాజధాని నిర్మాణ సంకల్పమే బలమైనదని, దానిని మించిన ముహూర్తం లేదని పేర్కొన్నారు. భూమిపూజ ముహూర్తాన్ని వివాదాస్పదం చేయడం హేయమని అభిప్రాయపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరికీ భయపడకుండా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళదామని అన్నారు. రాజధాని నిర్మాణానికి విరాళాలివ్వాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు.