: జూన్ 21న మోదీ యోగాసన ప్రదర్శన
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసన ప్రదర్శన చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ శ్వాస నియంత్రణ, ఇతర యోగాసనాలను ప్రదర్శిస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు హోం మంత్రిత్వ వర్గాలు చెబుతున్నాయి. భద్రతాపరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమైనట్టు సమాచారం. కాగా, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మోదీ యోగాను ఆచరిస్తారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ యోగా దినంగా జూన్ 21ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితి సమావేశంలో కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఆ రోజును అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి యోగా దినాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన అభిలషిస్తున్నారు.