: మన్మోహన్ ను పిలిచింది పాఠాలు చెప్పించుకోవడానికే: మోదీపై రాహుల్ సెటైర్


ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ నివాసానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లడం గురించి చెబుతూ... మన్మోహన్ ను మోదీయే ఆహ్వానించారని, ఆర్థిక రంగంపై గంటపాటు పాఠం చెప్పించుకోవడానికే పిలిపించుకున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యా రంగం, వ్యవసాయ రంగాలను పట్టించుకోకుండా, ప్రధాని బట్టలు ధరించడంపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. విద్య చాలా ముఖ్యమని చెప్పే ఆయన, అందుకు నిధులు ఖర్చు చేసేందుకు మాత్రం మొగ్గు చూపడంలేదని అన్నారు. దేశం ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ భావజాలం ఆధారంగా నడుస్తోందని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ అజెండానే ఎన్డీయే అమలు చేస్తోందన్నారు.

  • Loading...

More Telugu News