: బాబా రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ... కస్టడీ విధింపు
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సోదరుడు రాం భరత్ కు హరిద్వార్ లోని స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. అనంతరం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్టు తెలిపింది. పతంజలి ఫుడ్, హెర్డల్ పార్క్స్ సిబ్బంది, ట్రాన్స్ పోర్ట్ యూనియన్ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి రాం భరత్ ట్రాన్స్ పోర్టు నిర్వాహకులతో చర్చిస్తుండగా మాటామాటా పెరిగి ఘర్షణ పెద్దదైంది. దాంతో ఇరు వర్గాలు తుపాకులతో కాల్పులు జరుపుకోగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద రాం భరత్ పై కేసు నమోదు చేసినట్టు హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వీటీ సింగ్ తెలిపారు.