: అక్కడ కూడా మన దేశంలోలా ప్రవర్తించారు, బుక్కయ్యారు!
మనదేశంలో పలు విషయాల్లో చట్టాలు కాస్త లిబరల్ గా వుంటాయి. అందుకే, ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త హద్దు మీరినా ఫైన్ తో సరిపెట్టేస్తారు. ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులతో 'సర్దుబాట్లు' చేసుకున్నా సరిపోతుంది. అయితే కొన్ని దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ ను సిన్సియర్ గా పాటిస్తారు. న్యూజిలాండ్ లో పర్యటిద్దామని ఇద్దరు భారతీయులు వెళ్లారు. ఆక్కడ ఓ కారును అద్దెకు తీసుకున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, కబుర్లు చెప్పుకుంటూ కారును నెమ్మదిగా పోనిస్తున్నారు. ఇంతలో న్యూజిలాండ్ పోలీసులు వచ్చి వారి కారును ఆపారు. దీంతో బిత్తరపోయిన భారతీయులు, ఎందుకు ఆపారని వారిని అడిగారు. దీంతో, పోలీసులు, '100 కిలో మీటర్ల వేగంతో వెళ్లాల్సిన రోడ్డులో 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారని, మీ డ్రైవింగ్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారని, అందుకే మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని' అన్నారు. అంతే కాదు, వారి రెంటల్ కార్ కాంట్రాక్టు కూడా రద్దు చేశారు. దాంతో లబోదిబోమనడం మన వాళ్ల వంతయింది!