: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రియాల్టీ, మెటల్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 58 పాయింట్లు నష్టపోయి 27,507కు పడిపోయింది. నిఫ్టీ 16 పాయింట్లు కోల్పోయి 8,319 దగ్గర స్థిరపడింది. ఆమ్టెక్ ఆటో లిమిటెడ్, అరవింద్ లిమిటెడ్, పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీఈఎంఎల్ లిమిటెడ్, యూకో బ్యాంక్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. వోక్ హార్డ్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెడింగ్టన్ (ఇండియా) లిమిటెడ్ లు నష్టాలను మూటగట్టుకున్నాయి.