: సాంకేతిక పరిజ్ఞానంతో చెలరేగిన కాపీరాయుళ్లు
సాంకేతిక పరిజ్ఞానాన్ని కాపీ రాయుళ్లు బాగా వినియోగించుకుంటున్నారు. మరో గంటలో పరీక్ష జరగనుందనగా, వాట్స్ యాప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని షేర్ చేసుకుని అద్భుతంగా పరీక్ష రాశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ కళాశాలలో మధ్యాహ్నం 3 గంటలకు బీకాం చివరి సంవత్సరం పరీక్ష ప్రారంభం కానుందనగా, గంట ముందు ప్రశ్నాపత్రం వాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేశారు. దీంతో అంతా ముందుగానే పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. విషయం తెలిసిన పోలీసులు, వాట్స్ యాప్ లోని ప్రశ్నాపత్రాన్ని, అసలు ప్రశ్నాపత్రంతో పోల్చిచూడగా రెండూ ఒకేలా ఉన్నాయి. దీంతో వారు స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ స్కూలు ఛైర్మన్ ను వివరణ అడగగా, పేపర్ లీకైందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.