: వీర్ సావర్కర్ కు మోదీ, అమిత్ షా నివాళులు
స్వాతంత్ర్యోద్యమ యోధుడు వీర్ సావర్కర్ కు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాళులర్పించారు. సావర్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ట్విట్టర్లో స్పందించారు. ఆయన ధీరోదాత్తతకు, దేశానికి అందించిన సేవలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు. భారత్ పట్ల వీర్ సావర్కర్ అవధుల్లేని ప్రేమ ఆయనను తన మాతృభూమికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి పురిగొల్పిందని పేర్కొన్నారు. స్వతంత్ర పోరాటంలో అనేకమంది చేరడానికి ఆయన ప్రేరణగా నిలిచారని కొనియాడారు. వీర్ సావర్కర్ ప్రేమ, తెగువ, త్యాగాన్ని మాటల్లో వర్ణించలేమని అమిత్ షా ట్వీట్ చేశారు.