: ప్రభుత్వాల విభేదాల వల్ల బీసీ కులాలు నలిగిపోతున్నాయి: వీహెచ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభేదాల వల్ల కొన్ని బీసీ కులాలు నలిగిపోతున్నాయని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం 26 బీసీ కులాలను తొలగించటం అన్యాయమన్నారు. కొన్ని బీసీ కులాలు ఏపీలోనే ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఇలా చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు వీహెచ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనల ప్రకారమే సీఎం కేసీఆర్ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలు చేయాలని కోరారు.