: చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి!: జేసీ దివాకర్ రెడ్డి సూచన
తాను కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న మాట నిజమేనని... అయినా, తాను ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటానని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాదు గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడు ప్రాంగణంలో ఓ వార్తా చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా పాలనపైనే దృష్టి సారించారని... పార్టీ అంతర్గత వ్యవహారాలను పట్టించుకోవడం లేదని అన్నారు. పార్టీని కూడా అధినేత కొంత మేరకు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని... లేకపోతే కొంతమంది వల్ల పార్టీకి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎంతసేపూ రాష్ట్ర అభ్యున్నతి గురించి తపిస్తున్న చంద్రబాబు తన పద్ధతిని కొంచెం మార్చుకోవాలని విన్నవించారు.