: సీఎం చంద్రబాబుకు ఎంపీ కవిత ప్రతి సవాల్


హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామేనని, దానిపై చర్చకు సిద్ధమంటూ మహానాడు తొలిరోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్ కు ఎంపీ కవిత ప్రతి సవాల్ విసిరారు. హైదరాబాద్ పై చర్చకు తాము సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ లో భూములు అమ్ముకుంది ఎవరో, అభివృద్ధి చేసింది ఎవరో తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే తమ సవాల్ ను స్వీకరించాలని అన్నారు. మనుషులను చంపటం, ఆ తరువాత మాలలు వేయడం బాబుకు అలవాటేనని విమర్శించారు. ఇక టీడీపీ మహానాడు రికార్డింగ్ డాన్స్ ను తలపిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. సురవరం ప్రతాపరెడ్డి 119వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగానే ఆమె పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రెండుగా విడిపోతే సురవరం పేరు పెడతామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News