: అమెరికాలో భారత సంతతి విద్యార్థికి జీవిత ఖైదు
తన స్నేహితుడిని పాశవికంగా హత్య చేసిన కేసులో భారత సంతతి ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు అమెరికన్ కోర్టు గురువారం నాడు తీర్పును వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళితే, రాహుల్ జార్జియా వాషింగ్టన్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతనికి న్యాయశాస్త్రం చదివే మార్క్ (24) బాల్య స్నేహితుడు. ఈ క్రమంలో రాహుల్ గర్ల్ ఫ్రెండ్ తో మార్క్ పరిచయం పెంచుకుని చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీన్ని తట్టుకోలేని రాహుల్, 2013, అక్టోబర్ 13న మార్క్ నివసిస్తున్న అపార్టుమెంటుకు వెళ్లి 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాహుల్ దోషేనని వ్యాఖ్యానించిన కోర్టు ఈ మేరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది.