: లారీ బియ్యాన్ని చిందరవందర చేసిన ఏనుగుల గుంపు


రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటన పుత్తూరు మండలం గుత్తిపల్లి సమీపంలో జరిగింది. రోడ్డుపై తిష్టవేసిన ఏనుగులు లారీని అడ్డుకున్నాయి. లారీని బోల్తా కొట్టించాయి. రేషన్ బియ్యాన్ని నేలపాలు చేశాయి. బియ్యాన్ని తినలేకపోయిన ఏనుగులు నానాయాగీ చేశాయి. లారీని ధ్వంసం చేశాయి. లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను దక్కించుకున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఏనుగులు ఎక్కడ తమ గ్రామాలపై పడతాయోనని వారు తీవ్ర భయంలో ఉన్నారు. అధికారులు తక్షణం స్పందించి ఏనుగులను తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News