: సూట్ కేసులు అందుకుంటున్నానన్న విమర్శలు సరికాదు... సూట్ కేసులు మోసింది వారే!: నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మహానాడులో పాల్గొన్న ఆయన ఇటీవల తనపై వచ్చిన విమర్శల పట్ల ఘాటుగా స్పందించారు. తాను సూట్ కేసులు తీసుకుంటున్నానన్న విమర్శలు సరికాదని అన్నారు. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. పదేళ్లు ఢిల్లీకి సూట్ కేసులు మోసింది కాంగ్రెస్ వారేనని లోకేశ్ ప్రత్యారోపణ చేశారు. అయినా, సూట్ కేసులు తీసుకునేందుకు ఇది వైఎస్ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు.