: ఒలింపిక్ మ్యూజిక్ వీక్ ను ప్రారంభించిన జాకీ చాన్


ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ 2022 వింటర్ ఒలింపిక్ మ్యూజిక్ వీక్ ను ప్రారంభించారు. చైనా రాజధాని బీజింగ్ లో 2022 వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మ్యూజిక్ వీక్ ను ప్రారంభించారు. వింటర్ ఒలింపిక్స్ విజయవంతమయ్యేందుకు పూర్తిగా సహకరిస్తానని జాకీ చాన్ హామీ ఇచ్చారు. 'వేక్ అప్ వింటర్' పేరిట ఆయన స్వయంగా కంపోజ్ చేసిన ట్యూన్ ను బీజింగ్ లోని ఓ హోటల్ లో ఆయన విడుదల చేశారు. గతంలో ఒలింపిక్స్ నిర్వహించిన చైనా, 2022లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News