: అక్రమ తుపాకుల కర్మాగారం సీజ్
బీహార్ లో ఇళ్లల్లో నాటు తుపాకులు తయారు చేయడం సర్వసాధారణం. అయితే, సీక్రెట్ గా నడుస్తున్న ఓ తుపాకుల కర్మాగారం తాజాగా పోలీసుల కంటపడింది. భాగల్పూర్ జిల్లాలోని జిలోన్ ఇన్ టు గ్రామంలోని మామిడి తోటలో తుపాకులు తయారు చేస్తున్నారని సమాచారమందడంతో పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ భారీ ఎత్తున తుపాకులు తయారుచేసే కర్మాగారాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. దీంతో ఏడుగుర్ని అదుపులోకి తీసుకుని, ఫ్యాక్టరీని సీజ్ చేశారు. దేశంలో ఎక్కడ అక్రమ తుపాకీ కనబడినా దానికి, బీహార్ కి ఏదో ఒక సంబంధం ఉండడం విశేషం.