: ప్రధాని మోదీని కలసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ప్రధానిగా తాను పదవి చేపట్టి ఏడాది అయిన సందర్భంగా అభినందించేందుకు మన్మోహన్ సింగ్ వచ్చారని మోదీ ట్వీట్ చేశారు. కాగా, మన్మోహన్ ప్రధానిగా ఉండగా లెక్కలేనన్ని కుంభకోణాలు చోటుచేసుకున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు సహా పలువురు తీవ్ర విమర్శలు చేయడంతో స్పందించిన మన్మోహన్ సింగ్, ప్రధాని కార్యాలయాన్ని తన స్వంత అవసరాల కోసం వినియోగించుకోలేదని స్పష్టం చేశారు. బాధ్యతను నిర్వర్తించానే తప్ప, స్వార్థంతో ఏనాడూ పని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News