: కుక్కకు ఖరీదైన గిఫ్టులు


పిల్లలకి తల్లిదండ్రులు రకరకాల వస్తువుల్ని కానుకలుగా ఇస్తుంటారు. అయితే, చైనాలో అత్యంత ధనవంతుడైన వాంగ్ జియాన్ లిన్ తన కుమారుడు వాంగ్ సికాంగ్ కు ఓ కుక్కను బహుమతిగా ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన బహుమతికి మురిసిపోయిన సికాంగ్, ఆ కుక్కకు రెండు యాపిల్ వాచ్ లు గిఫ్టుగా కొన్నాడు. ఒక్కో వాచ్ ధర 1099 అమెరికన్ డాలర్లు కావడం విశేషం. కుక్క ముందరి కాళ్లకు ఆ వాచ్ లు తగిలించి, ఫోటోలు తీసి వైబోలో పోస్టు చేశాడు. అంతే కాదు, చైనీస్ ట్విట్టర్ గా పేరొందిన వైబోలో దాని పేరుమీద ఓ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ పేజ్ లో కుక్క విశేషాలు, కుక్క కబుర్లు పెడుతుంటాడు. కుక్క మాట్లాడుతున్నట్టు ముచ్చట్లు కూడా పెడతాడు. కుక్కకు ఫాలోవర్లు కూడా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News