: నెంబర్ వన్ స్థానం ప్రతి శుక్రవారం మారుతుంటుంది: ప్రియాంక చోప్రా


సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల నెంబర్ వన్ స్థానాలపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనదైన శైలిలో మాట్లాడింది. నెంబర్ వన్ స్థానం అనేది ప్రతి శుక్రవారం మారుతుంటుందని పేర్కొంది. వారు నటించిన సినిమా వసూళ్లు ఆ స్థానంపై ప్రభావం చూపుతాయని చెప్పింది. అందుకే చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ అంటూ ఎవరూ ఉండరని పీసీ తేల్చేసింది. అయితే టాప్-5 కథానాయికల్లో తాను కచ్చితంగా ఉంటానని స్పష్టం చేసింది. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పైవిధంగా మాట్లాడింది. తనను తాను ఎప్పుడూ స్టార్ గా భావించనని, ఓ సాధకురాలిగా భావిస్తానని తెలిపింది. బాలీవుడ్ లో తన 13 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఎప్పుడూ మెరుగ్గా పనిచేయాలనుకుంటానని, ప్రేక్షకులను రంజింపజేయాలనుకుంటానని పీసీ పేర్కొంది.

  • Loading...

More Telugu News