: పీఎంవో వెబ్ సైట్ కు కొత్త లుక్కు... ప్రధానికి నేరుగా ఈ-మెయిల్ పంపొచ్చు!


ఎన్డీయే సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ వెబ్ సైట్ ను పూర్తిగా నవీకరించారు. యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, ఈ వెబ్ సైట్ కు కొత్తరూపు తెచ్చారు. తద్వారా, ఇకపై ప్రధానికి నేరుగా ఈ-మెయిల్ పంపేందుకు వీలవుతుంది. దీనిపై ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. "పీఎంవో వెబ్ సైట్ కు కొత్త లుక్కు వచ్చింది, వెబ్ సైట్ ను దర్శించండి" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, ఈ సైట్లో తాజా వార్తలు, ప్రధాని ఫొటోలు, ప్రవచనాలు, ప్రసంగాలు కూడా పొందుపరుస్తారు.

  • Loading...

More Telugu News