: డ్రోన్ పై ప్రయాణించి రికార్డులకెక్కాడు
టెక్నాలజీని వినియోగించుకుని రికార్డు పుటలకెక్కాడో వ్యక్తి. నిఘా లేదా వస్తువులు తరలించేందుకు వినియోగించే డ్రోన్ లను వినూత్నంగా ఉపయోగించుకుని ఓ కెనడియన్ గిన్నిస్ రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు. కేటలిన్ అలెగ్జాండర్ అనే ఇంజనీర్ ఓ డ్రోన్ ను స్వయంగా తయారు చేశాడు. దానిపైకెక్కి గాలిలో విహరించాడు. ఒక సరస్సుపై 15 అడుగుల ఎత్తులో అలెగ్జాండర్ 275.9 మీటర్ల దూరం ప్రయాణించాడు. దీంతో, డ్రోన్ పై నిలుచుని అంతదూరం ప్రయాణించిన తొలి వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాడు.