: ఒబామా కుమార్తెపై మనసు పారేసుకున్న యువ లాయర్


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాపై కెన్యాకు చెందిన ఓ యువ లాయర్ మనసుపడ్డాడు. ఫెలిక్స్ కిప్రొనో అనే ఈ న్యాయవాది మలియాను తనకిచ్చి పెళ్లి చేసేట్టయితే కన్యాశుల్కం కూడా ఇచ్చుకుంటానని చెబుతున్నాడు. పిల్లనిస్తే 70 గొర్రెలు, 50 గోవులు, 30 మేకలను మామకు సమర్పించుకుంటాడట. తన ప్రేమ స్వచ్ఛమైనదని నొక్కి చెబుతున్న కిప్రొనో, జీవితంలో డబ్బే ముఖ్యం కాదని అంటున్నాడు. 2008లోనే మలియాతో వన్ సైడ్ లవ్ లో పడ్డానని తెలిపాడు. నిజం చెప్పాలంటే, తానింతవరకు ఎవరితోనూ డేటింగ్ చేయలేదని, ఆమెకు విధేయుడిగా మసలుకుంటానని స్పష్టం చేశాడు. జూలైలో ఒబామా కెన్యా రానున్న సందర్భంగా ఆయనతో మాట్లాడతానని చెప్పాడు. మలియాను కూడా కెన్యా పర్యటనకు తీసుకురమ్మని ఒబామాకు లేఖ రాస్తాడట.

  • Loading...

More Telugu News