: చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ కు మాతృవియోగం


చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కు మాతృవియోగం కలిగింది. ఆనంద్ తల్లి సుశీల బుధవారం చెన్నైలో కన్నుమూశారు. నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. రేపు (గురువారం) చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. చదరంగంలో ఆనంద్ కు తల్లే తొలి గురువు. ఆమె వద్ద నేర్చుకున్న పాఠాల పునాదే విషీని అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారుడిగా నిలిపింది. కాగా, ఆమె మృతికి అఖిల భారత చెస్ సమాఖ్య సంతాపం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News