: ఆ పోలీస్ స్టేషన్ అంటేనే భయపడుతున్న పోలీసులు!


ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఖండోలి పోలీస్ స్టేషన్ కు ఓ ప్రత్యేకత ఉంది. పోస్టింగ్ పై అక్కడికి వెళ్లిన పోలీసులకు సస్పెన్షన్ ఆర్డర్ల భయం పట్టుకుంది. గడచిన మూడు నెలలుగా అక్కడ పనిచేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్ హెచ్ఓ), సబ్ ఇన్ స్పెక్టర్లు, కానిస్టేబుళ్లలో అత్యధికులు సస్పెన్షన్ ఆర్డర్లు అందుకున్నవారే కావడం గమనార్హం. దీంతో, వారికి 'సెంటిమెంట్' భయం పట్టుకుంది. ఖండోలి పీఎస్ లో పోస్టింగ్ వస్తే సస్పెన్షన్ తప్పదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకు విరుగుడుగా ఓ హోమం నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లోనే ఉన్న ఎస్ హెచ్ఓ అధికారిక నివాసంలో ఈ తంతు పూర్తి చేశారు. ఇందులో ఎస్ హెచ్ఓ, సబ్ ఇన్ స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు అందరూ పాల్గొన్నారు. అనంతరం, గుడికి వెళ్లి ప్రార్థనలు కూడా చేశారు. సస్పెన్షన్ల బారి నుంచి తమను కాపాడమని ఆ భగవంతుడిని వేడుకున్నారట.

  • Loading...

More Telugu News