: జాతీయ పార్టీ దిశగా మహానాడులో తీర్మానం
టీడీపీని జాతీయ పార్టీగా మలిచేందుకు తొలి అడుగు పడింది. ఈ రోజు హైదరాబాదులోని గండిపేట వేదికగా ప్రారంభమైన మహానాడులో ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర కమిటీ ఏర్పాటు, కేంద్ర స్థాయిలో పొలిట్ బ్యూరో, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలు, కేంద్ర కమిటీలో పదవులులాంటి అంశాలకు సంబంధించి పార్టీ నియమావళిలో మార్పులు చేస్తూ సవరణ తీర్మానాలు ప్రవేశపెట్టారు.