: ఏపీ రాజధాని భూమి పూజ ప్రదేశం ఖరారు


ఆంధ్రప్రదేశ్ రాజధానికి జూన్ 6న భూమి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమి పూజ ఎక్కడ జరగాలన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున, దుర్గమ్మకు ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని భూమిపూజ కోసం ఎంపిక చేశారు. కృష్ణానది కరకట్టకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయిపాలెం మధ్యలో ఆ స్థలం ఉందట. జడ్పీటీసీ నరేంద్ర కుటుంబ సభ్యులకు చెందిన ఆ స్థలాన్ని భూమి పూజకు ఎంపిక చేయడంపై నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక స్థలం ఖరారు చేస్తూ సీఎం కార్యాలయం కూడా అనుమతి తెలిపిందట. ఈ నేపథ్యంలో కలెక్టర్ కాంతిలాల్, జేసీ శ్రీధర్, ఎస్పీలు త్రిపాఠి, నాయక్ ఆ స్థలాన్ని పరిశీలించి, భద్రత ఏర్పాట్లపై చర్చించారు.

  • Loading...

More Telugu News