: అన్ని బ్యాంకుల్లో ఉద్యోగాలు వెల్లువెత్తుతున్న వేళ... ఉద్యోగులను తగ్గించుకున్న ఐసీఐసీఐ, యాక్సిస్


విస్తరణ ప్రణాళికల్లో భాగంగా పలు బ్యాంకులు కొత్త ఉద్యోగులను తీసుకుంటుంటే, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు మాత్రం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. 2010 నుంచి 2014 మధ్య ఐసీఐసీఐలో బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 35,256 నుంచి 72,226కు పెరుగగా, ఆ తరువాత 2014-15లో ఆ సంఖ్య 67,857కు తగ్గింది. ఇదే సమయంలో యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగుల సంఖ్య 42,420 నుంచి 42,230కి తగ్గింది. నిర్వహణా వ్యయాలు తగ్గించుకునే ప్రయత్నాలతో పాటు డిజిటలైజేషన్ విధానం మరింతగా అందుబాటులోకి వచ్చి బ్యాంకులకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గడంతోనే ఉద్యోగుల సంఖ్యనూ తగ్గించుకోవాల్సి వచ్చిందని ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.ఎస్. కన్నన్ వివరించారు. ఎవరి ఉద్యోగాలనూ తీసివేయలేదని, ఇదే సమయంలో ఉద్యోగం మానివేసిన వారి స్థానంలో ఎవరినీ విధుల్లోకి తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News