: కోస్తాంధ్రను పలకరించిన భారీ వర్షం... గంతులేసిన యువత


కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు పలకరించాడు. ఈ మధ్యాహ్నం కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. గుంటూరు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. గుంటూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంటే, సేదదీరేందుకు బయటకు వచ్చిన యువతీ యువకులు ఆనందంతో గంతులేశారు. రేపల్లెలో వడగళ్ల వర్షం పడింది. కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. చత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ నెలకొన్న అల్పపీడన ద్రోణి కారణంగా పలు చోట్ల వర్షాలు పడవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News