: మహానాడు ఫోటో ఎగ్జిబిషన్ లో ఎన్టీఆర్ 'పెళ్లి శుభలేఖ'
గండిపేటలో జరుగుతున్న టీడీపీ 34వ మహానాడులో నందమూరి తారక రామారావు, బసవతారకంల పెళ్లి శుభలేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మే 2వ తేదీ 1942 చిత్రభాను సంవత్సరం అనురాధ నక్షత్రంలో తెల్లవారు జామున 3.23 గంటల సుముహూర్తాన వారిద్దరి వివాహం కృష్ణాజిల్లా కొమరవోలు గ్రామంలో జరిగినట్టు అందులో ఉంది. బసవతారకం తండ్రి కాట్రగడ్డ చెంచయ్య పేరుతో ఈ శుభలేఖను ముద్రించారు. మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలంతా ఈ శుభలేఖను ఆసక్తిగా తిలకిస్తున్నారు.