: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించిన ఎమ్మార్పీఎస్


ఒక వైపు హైదరాబాదులోని గండిపేటలో టీడీపీ ఘనంగా మహానాడు వేడుకలు జరపుకుంటుంటే... మరోవైపు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. ఎస్సీ వర్గీకరణపై టీడీపీ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద మాదిగగా ఉంటానని ఆనాడు చెప్పిన చంద్రబాబు... సీఎం అయిన తర్వాత మాదిగలను మోసం చేశారని వారు ఆరోపించారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News