: డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షకు ఒప్పుకోని హాలీవుడ్ నటుడు అరెస్ట్


హాలీవుడ్ నటుడు, పులిట్జర్ బహుమతి గ్రహీత సామ్ షెపర్డ్ (ప్లే రైట్ ఫేం)ను న్యూ మెక్సికో పోలీసులు డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్ చేశారు. 71 సంవత్సరాల షెపర్డ్ రెండు 'టకీలా'లు సేవించారని, శ్వాస పరీక్షకు అంగీకరించకపోవడంతో అరెస్ట్ చెయ్యాల్సి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. ఆయన డౌన్ టౌన్ శాంతా ఫే రెస్టారెంటు నుంచి వెలుపలికి వచ్చి ఎమర్జన్సీ బ్రేకులు వేసివున్న పికప్ ట్రక్కును నడిపేందుకు ప్రయత్నిస్తుండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కళ్లు మగతలు పడి, మద్యం వాసన వేస్తున్న స్థితిలోని షెపర్డ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను శాంతా ఫే కౌంటీ జైలుకు తరలించారు. బ్లాక్ హ్యాక్ డౌన్, స్టీల్ మాగ్నోలియాస్, ది రైట్ స్టఫ్, ది నోట్ బుక్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. గతంలో 2009లో కూడా ఆయన డ్రంకెన్ డ్రైవింగ్ టెస్టులో దొరికిపోయి వార్తల్లోకెక్కారు.

  • Loading...

More Telugu News