: ఆ నలుగురు భారత మహిళలు ప్రపంచంలోనే శక్తిమంతులు!


ప్రముఖ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' ప్రకటించిన '100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో నలుగురు భారతీయ మహిళలకు స్థానం లభించింది. జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తొలి స్థానంలో నిలిచిన ప్రపంచ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చంద కొచ్చర్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్ టీ మీడియా చైర్ పర్సన్ శోభనా భార్తియాలకు చోటు దక్కింది. వీరితో పాటు భారత సంతతికి చెందిన మరో ఇద్దరూ లిస్టులో స్థానం సంపాదించారు. పెప్సీకో చీఫ్ ఇంద్ర నూయి, సిస్కో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ లకు స్థానం దక్కింది. టాప్ 10లో మెర్కెల్ తో పాటు హిలరీ క్లింటన్, మిలిందా గేట్స్, జానెట్ ఎలెన్ (ఫెడ్ రిజర్వ్ చీఫ్), మ్యారీ బర్రా (జనరల్ మోటార్స్ సీఈఓ), క్రిస్టిన్ లగార్డే (ఐఎంఎఫ్ చీఫ్), దిల్మా రౌసెఫ్ (బ్రెజిల్ అధ్యక్షురాలు), షెరిల్ శాండ్ బెర్గ్ (ఫేస్ బుక్ సీఓఓ), సుసాన్ వోజ్ సిస్కీ (యూట్యూబ్ సీఈఓ), మిచెల్ ఒబామాలు వరుసగా నిలిచారు. అరుంధతీ భట్టాచార్య 30వ స్థానంలో, చంద కొచ్చర్ 35, కిరణ్ మజుందార్ షా 85, శోభనా భార్తియా 93వ స్థానాల్లో నిలిచారు. గత సంవత్సరంతో పోలిస్తే అరుంధతీ భట్టాచార్య ఆరు స్థానాలు, కొచ్చర్ 8 స్థానాలు, మజుందార్ షా 7 స్థానాలు ఎగబాకారు.

  • Loading...

More Telugu News