: ఆ తలపిన్నుకి భారీ రేటు పలుకుతోంది!
పొడవాటి జుట్టును పెంచి ముడి వేసే కుర్రాళ్లని ఈ రోజుల్లో బాగానే చూస్తున్నాం. అయితే, ఇది నేటి ఫ్యాషన్ అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే, ఈ ఫ్యాషన్ 18వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ కంపోజర్ వోల్ఫ్ గాంగ్ అమెడియన్ మొజార్ట్ కు కూడా పొడవాటి జుట్టు ఉండేది. దీనిని ఆయన ప్రత్యేకమైన పిన్నుతో అలంకరించేవాడట. లాకెట్ లాంటి ఆకారం కలిగిన ఈ పిన్ను బంగారంతో తయారైంది. ఈ పిన్నును న్యూయార్క్ లోని సౌత్ బే ఆక్షన్ హౌస్ లో వేలం వేయనున్నారు. దీనికి 12000 పౌండ్లు ధర పలకవచ్చని వారు భావిస్తున్నారు. అంటే భారత కరెన్సీలో 11 లక్షల రూపాయల ధర రావచ్చని భావిస్తున్నారు.