: డార్విన్ సందర్శించిన దీవిలోని పర్వతం నిప్పులు కక్కుతోంది


జీవపరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ సందర్శించిన దీవిలోని ఓ అగ్నిపర్వతం నిప్పులు కక్కుతోంది. 1835లో ఛార్లెస్ డార్విన్ ఈక్వెడార్ లోని గాలాపగోస్ దీవులను సందర్శించారు. ఈ దీవుల్లోని ఇసబెల్లా దీవిలో ఉన్న 1.7 కిలోమీటర్ల ఎత్తైన వోల్ఫ్ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ దీవి విభిన్నమైన వృక్ష, జంతు జాతులకు నిలయం. ప్రపంచంలోని అత్యంత అరుదైన గులాబీ రంగు ఉడుములు ఈ దీవుల్లోనే కనబడతాయి. అలాంటి ఈ దీవిలో అగ్ని పర్వత విస్పోటనంతో జంతు, వృక్ష జాతులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమైంది. అయితే, బద్దలైన అగ్ని పర్వతం దక్షిణ దిక్కుగా లావా విరజిమ్ముతోంది. దీంతో ఉత్తరాన ఉండే జీవ సంపదకు నష్టం వాటిల్లే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News