: ఏడాదిగా ఒక్కటన్నా అలాంటి సంఘటన జరిగిందా?: కేటీఆర్


తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ప్రభుత్వ విజయాలపై ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఏపీ కూడా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఏపీ ప్రజలపై ద్వేషం లేదని అన్నారు. రాష్ట్రం విడిపోతే, ఏపీ ప్రజలను తెలంగాణ నుంచి తరిమికొడతారని ప్రచారం జరిగిందని, ఏడాదిగా అలాంటి ఘటన ఒక్కటన్నా జరిగిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవడం మంచిదేనని, తద్వారా ఏపీకి ఎన్నో ప్రాజెక్టులు లభిస్తాయని తెలిపారు. ఇక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు పిచ్చెక్కిందని అన్నారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పుట్టకముందే తెలంగాణ 'మిగులు' రాష్ట్రమన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. హైదరాబాద్ ను ఎవరూ ఉద్ధరించలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి సహజంగానే ఎన్నో అనుకూలతలు ఉన్నాయని కేటీఆర్ వివరించారు. అటు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. పని లేకే రాహుల్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News