: విశాఖలో వాల్ మార్ట్ దుకాణం


అమెరికా రిటైల్ అమ్మకాల దిగ్గజం వాల్ మార్ట్ భారత్ లో మరో రెండు హోల్ సేల్ స్టోర్లు తెరిచేందుకు సన్నద్ధమైంది. విశాఖపట్నంలో ఒకటి, పంజాబ్ లోని లుథియానాలో మరొక స్టోర్ ను నెలకొల్పుతున్నట్టు వాల్ మార్ట్ వర్గాలు తెలిపాయి. వాల్ మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్ అయ్యర్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. "ఈ రెండు క్యాష్ అండ్ క్యారీ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంతర్గత అనుమతులు ఇటీవలే లభించాయి. ఒక స్టోర్ ను విశాఖలో, రెండో స్టోర్ ను పంజాబ్ నగరం లుథియానాలో ప్రారంభిస్తున్నాం" అని ఆ ప్రకటనలో వివరించారు. సంబంధిత లైసెన్సులు, ఇతర అనుమతులను పొందేందుకు ఓ బృందం పనిచేస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News