: భారత మార్కెట్లోకి రానున్న 'ఐరన్ మ్యాన్' ఫోన్
భారత విపణిని ఎన్నో సౌకర్యాలున్న మొబైల్ ఫోన్ లు ముంచెత్తుతున్నాయి. అదే కోవలో, తాజాగా సామ్ సంగ్ కంపెనీ 'ఐరన్ మ్యాన్' ఫోన్ ను భారత మార్కెట్ లో ప్రవేశపెడుతోంది. 'గెలాక్సీ ఎస్6 ఎడ్జ్' వెర్షన్ ను 'ఐరన్ మ్యాన్' మోడల్ గా సామ్ సంగ్ భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. హాలీవుడ్ సినిమా 'ఎవేంజర్స్' లోని 'ఐరన్ మ్యాన్' పాత్ర బొమ్మ ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రింట్ చేసి ఉంటుంది. ఎరుపు, బంగారం రంగులలో లభ్యమయ్యే ఈ ఫోన్ లో సామ్ సంగ్ 'ఎస్ 6' లో ఉన్న ఫీచర్లే ఉంటాయి. ఈ ఫోన్ కోసం ఐరన్ మ్యాన్ అభిమానులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని సామ్ సంగ్ వెల్లడించింది.