: తలనీలాలు సమర్పించి... శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేశ్
టాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల విచ్చేశారు. తలనీలాలు సమర్పించి, నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రతిసారి కొత్త శక్తి లభిస్తుందని తెలిపారు. ఇక్కడకు వచ్చి వెళితే, విజయాలు సిద్ధిస్తాయని చెప్పుకొచ్చారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం తర్వాత ఆయనతో ఏమైనా సినిమా చేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. తప్పకుండా చేస్తానని బదులిచ్చారు. ప్రస్తుతం చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయని గణేశ్ వివరించారు.