: గంగూలీని కోచ్ గా నియమిస్తే మహత్తరంగా రాణిస్తాడు: బ్రెట్ లీ
డంకన్ ఫ్లెచర్ నిష్క్రమణ తర్వాత టీమిండియా కోచ్ పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత క్రికెట్ వర్గాల్లో మాత్రం కోచ్ గా సౌరవ్ గంగూలీ అయితే మేలన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడు. భారత జట్టుకు హెడ్ కోచ్ గా గంగూలీ వస్తే మాత్రం, మహత్తరంగా రాణిస్తాడని తెలిపాడు. గంగూలీ క్రికెట్ పరిజ్ఞానం అపారమైనదని, అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన అనుభవం అతడి సొంతమని పేర్కొన్నాడు. కోచ్ గా సరైన సమతుల్యత కలిగి ఉండడం అత్యంత ప్రధానమని అన్నాడు.