: శ్రీచక్ర, అవని గోల్డ్ ఫామ్స్ ఆస్తుల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
విశాఖలోని శ్రీచక్ర, కర్నూలులోని అవని గోల్డ్ ఫామ్స్ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది. డిపాజిటర్ల నుంచి శ్రీచక్ర 15.18 కోట్లు, అవని సంస్థ రూ.19 కోట్లు వసూలు చేసినందున ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థల డైరెక్టర్ల ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.