: ఆ మతపెద్ద టీవీ చూసి పాతికేళ్లయిందట!
క్యాథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ టీవీ చూసి పాతికేళ్లయిందట. 1990 జులై 15 నుంచి టీవీ చూడడం మానేశానని పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా వెల్లడించారు. అర్జెంటీనాకు చెందిన పోప్ ఫ్రాన్సిస్ టీవీ చూడడం మానేసినప్పటికీ తాను అభిమానించే ఫుట్ బాల్ జట్టు సాన్ లొరెంజో డీ అల్మెర్గో యొక్క వారం వారీ ఫలితాలు మాత్రం వ్యక్తిగత భద్రతా సిబ్బంది ద్వారా తెలుసుకుంటారట. టీవీకి దూరంగా ఉండే పోప్ ఫ్రాన్సిస్ ప్రతి రోజూ పది నిమిషాలు వార్తాపత్రికలు చదువుతారు. ప్రజల్లో మమేకమవ్వడాన్ని అమితంగా ఇష్టపడే పోప్ ఫ్రాన్సిస్ ఆరుబయట నడిచేందుకు నిబంధనలు అడ్డురావడం ఆందోళనకరమని వాపోయారు. కాగా, అద్భుతమైన బంగ్లా, అన్ని సౌకర్యాలు అమర్చే సేవకులు ఉన్నా, ఆయన వాటిని త్యజించడం విశేషం. కేవలం ఒక గదితోనే ఆయన సరిపెట్టుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.