: చనిపోయాడని మార్చురీకి తరలిస్తుండగా... కదిలాడు!
46 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తన అపార్ట్ మెంట్ లో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ స్థితిలో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయాడని తేల్చి చెప్పారు. శరీరం చల్లబడి, గుండె కొట్టుకోకపోవడంతో చనిపోయాడనే అందరూ భావించారు. అనంతరం, అతడిని మార్చురీకి తరలిస్తుండగా... ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. దీంతో మార్చురీకి తరలిస్తున్నవారు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, చనిపోయాడనుకున్న వ్యక్తి కుడి చెయ్యి, కుడి కాలు కూడా కదలడం ప్రారంభమైంది. దీంతో, అతడిని మళ్లీ వైద్యుల వద్దకు తరలించారు. ఆ తర్వాత వైద్యులు మాట్లాడుతూ, అతడు చాలా అరుదైన కోమాలోకి వెళ్లి, తిరిగి స్పృహలోకి వచ్చాడని వెల్లడించారు. ఈ ఘటన, అమెరికాలోని విస్కాన్సిన్ స్టేట్ మిల్ మాకీ నగరంలో చోటుచేసుకుంది.