: మన్మోహన్ విధానాలనే మోదీ సర్కారు కూడా కొనసాగిస్తోంది: ఏచూరి
ఎన్డీయే ప్రభుత్వంపై సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. మోదీ పాలనలో మతోన్మాద రాజకీయాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. మధుర ఆలయ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు కూడా సరిగా లేవని... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలనే మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వం సంపన్నుల కొమ్ము కాస్తోందని... పేదవాళ్లు మరింత పేదలుగా దిగజారుతుంటే, సంపన్నులు మరింత ధనవంతులుగా మారుతున్నారని చెప్పారు. దేశాన్ని, ప్రజలను రక్షించేందుకు ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధమని తెలిపారు.