: విలాసాల మోజుతో 13 ఏళ్లకే వ్యభిచార రొంపిలో దిగింది!


ఫ్రెండ్స్ చేతిలో ఖరీదైన ఫోన్లు తనకెందుకు లేవు? వారిలా ఎందుకు విలాసవంతంగా గడపలేకపోతున్నాను?... ఓ టీనేజ్ బాలిక మదిలో రేగిన ప్రశ్నలివి. కొందరు కష్టపడి కలలను సాకారం చేసుకునేందుకు యత్నిస్తారు. మరికొందరు అడ్డదారుల్లో పయనిస్తారు. గుజరాత్ లోని సుభాన్ పురా ప్రాంతానికి చెందిన ఓ చిన్న దుకాణదారు కుమార్తె కూడా సులభంగా డబ్బు సంపాదించి, విలాసవంతంగా బతకాలని భావించింది. అందుకు, వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంది. 13 ఏళ్ల వయసుకే గర్భం దాల్చగా, తల్లి నిలదీయడంతో విషయం బయటపడింది. హితబోధ చేసినా వినలేదు. దండించినా పరిస్థితిలో మార్పు రాలేదు. వ్యభిచారం చేస్తూ, సంపాదనే లక్ష్యంగా విచ్చలవిడిగా వ్యవహరించింది. మేనమామ ఇంటికి పంపితే, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో, ఆ బాలిక తల్లి 'అభయం' టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. వారు ఆ బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ టీనేజ్ అమ్మాయి చెప్పిన వివరాలు విని అక్కడి వారు ఆశ్చర్యపోయారట. స్నేహితుల ఖరీదైన లైఫ్ స్టయిల్ చూసే తాను వ్యభిచార రొంపిలో దిగానని వెల్లడించింది. అంతేగాదు, తల్లి దుకాణానికి వెళ్లి తిరిగి వచ్చేలోగా, వ్యభిచారం చేసేదాన్నని తెలిపింది. భర్త లేకపోవడంతో, దుకాణం నిర్వహిస్తూ, కుమార్తెను పట్టించుకోలేదని, దాని ఫలితమే ఇదంతా అని ఆ తల్లి వాపోయింది.

  • Loading...

More Telugu News