: ముగిసిన కడియం, గంటా భేటీ... ఎంసెట్ కౌన్సెలింగ్ కు సహకరించాలని కోరామన్న గంటా


తెలంగాణ, ఏపీ విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావుల భేటీ ముగిసింది. తెలంగాణ సచివాలయంలోని కడియం ఛాంబర్ లో జరిగిన ఈ భేటీలో, ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ కు సహకారం, రెండు రాష్ట్రాల మధ్య విద్యా పరంగా నెలకొన్న సమస్యలపై చర్చించుకున్నారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉన్నత విద్యామండలిలో ఉద్యోగులు, రికార్డులు, కౌన్సెలింగ్ స్థలం, ఫర్నిచర్ గురించి ఆ ప్రభుత్వాన్ని అడిగినట్టు చెప్పారు. వచ్చే నెల 12న కౌన్సెలింగ్ ఉందని చెప్పామని, దానికోసం ఉన్నత విద్యామండలిలో స్థలం, డేటా, కంప్యూటర్లు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా కలసి వెళ్లాలని కోరామని గంటా వివరించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తమకున్న ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, త్వరలోనే మంత్రి స్మృతి ఇరానీని కలసి సమస్యలు చెబుతామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News