: రెండు కోట్లు వదిలేసుకుంది...బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది!


'రెండు కోట్లిస్తాం, ఫెయిర్ నెస్ క్రీము వాణిజ్య ప్రకటనలో నటించండి' అంటూ వచ్చిన ఆఫర్ ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో ఆమెను మీడియా ప్రశ్నించడంతో ఆసక్తికర సమాధానం చెప్పింది. 'నా శరీర ఛాయ మొదట్లో బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంది' అని చెప్పుకుంటే మనల్ని మనం కించపరుచుకున్నట్టేనని చెప్పింది. అంతే కాకుండా, 'మా అక్క సూచించడంతో ఈ క్రీము వాడుతున్నానని చెప్పడం వారిని కించపరచడమే. తోటి మహిళల్ని కించపరిచే యాడ్ లో నేను నటించలేనని' స్పష్టం చేశానని కంగనా చెప్పింది. అలాంటి అవాస్తవ ప్రకటనలు నిషేధించాలని డిమాండ్ చేస్తానని కంగనా చెప్పింది. అలాగే వివాహం చేసుకోవడంపై స్పందిస్తూ, '28 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోవాలా?' అని ప్రశ్నించింది. పెళ్లికి ఫలానాదే సరైన సమయం అని ఉండదని, మనసుకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే వివాహం చేసుకోవాలని కంగనా తెలిపింది.

  • Loading...

More Telugu News