: తెలంగాణలో మెడికల్ సీట్లను విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు: ఎమ్మెల్సీ పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ సీట్లను విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. సీట్ల అమ్మకాల వెనుక ఏదో తతంగం నడుస్తోందని... టీఆర్ఎస్ నేతలు ఈ వ్యవహారంలో కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతోందని అన్నారు. ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ సర్కార్ చోద్యం చూస్తుండటమే దీనికి కారణమని చెప్పారు. మెడికల్ బి-కేటగిరి సీట్లకు ప్రవేశ పరీక్ష ఉందనే విషయం కూడా సదరు శాఖ మంత్రికి తెలియకపోవడం విచారించదగ్గ అంశమని విమర్శించారు. ఎంబీబీఎస్ సీట్లపై నియంత్రణ ఉండాలని పొంగులేటి సూచించారు.