: వడదెబ్బకు ఏపీలో 551 మంది మృతి: హోంమంత్రి చినరాజప్ప
వడదెబ్బకు తాళలేక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 551 మంది చనిపోయారని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అంతేగాక మండల అధికారులతో కమిటీ వేసి మృతుల వివరాల నమోదుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు వివరించారు. వడదెబ్బ బారిన పడకుండా వృద్ధులు, పిల్లలను జాగ్రత్తగా ఉంచాలని మీడియా ముఖంగా చినరాజప్ప సూచించారు. ఇదే సమయంలో టీడీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. అసలు రాష్ట్రంలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ గుర్తును ఎప్పుడో రద్దు చేయాల్సిందని చురకంటించారు.