: నేతను టార్గెట్ చేశారు... బాడీగార్డ్ దుర్మరణం పాలయ్యాడు
బీహార్ లోని గయ జిల్లా జేడీయూ పార్టీ అధ్యక్షుడు అభయ్ కుష్వాహాకు ఈరోజు ఓ పార్శిల్ వచ్చింది. ఈ పార్శిల్ ను ఆయన బాడీగార్డ్ ఓపెన్ చేశారు. అయితే, పార్శిల్ లో ఉన్నది బాంబ్ కావడంతో, దాన్ని ఓపెన్ చేసిన వెంటనే అది పేలిపోయింది. ఈ దారుణ ఘటనలో అభయ్ బాడీగార్డ్ అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, అతని బంధువు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు సంబంధించి విచారణ చేపట్టామని... ఈ పేలుడుతో మావోయిస్టులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో కూడా విచారిస్తున్నామని అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ తెలిపారు.